
బీఆర్ఎస్ సర్కారుపై అమిత్ షా చురకలు.. కేసీఆర్ కారు, ఒవైసీ స్టీరింగ్ అంటూ..
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.
ఈ మేరకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ జన గర్జన సభలో పాల్గొన్నారు.
అనంతరం ప్రసంగించిన మంత్రి, తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని, పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
గత 10 ఏళ్లుగా, కేసీఆర్ తన కుటుంబం కోసమే పనిచేశారని, రైతుల ఆత్మహత్యలో రాష్ట్రాన్ని నెం.1గా చేశారన్నారు.
అవినీతిలోనూ తెలంగాణను నెంబర్ 1గా మార్చారన్నారు. కేసీఆర్ ఎన్నికల గుర్తు కారు, కానీ స్టీరింగ్ మాత్రం ఒవైసీ వద్దే ఉందని చురకలు అంటించారు.
మజ్లిస్ కనుసన్నుల్లోని బీఆర్ఎస్ పార్టీని పాతరేసి బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గత 10 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబం కోసమే పనిచేశారు: అమిత్ షా
Addressing the enthusiastic people of Adilabad at 'Jana Garjana Sabha' in Telangana. తెలంగాణలో నిర్వహిస్తున్న 'జన గర్జన' సభలో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్న ఆదిలాబాద్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న. https://t.co/X9h2rWudGG
— Amit Shah (@AmitShah) October 10, 2023