George Kurian: కేంద్ర మంత్రి జార్జి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వ కాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈసారి భారతీయ జనతా పార్టీ ఆయనను మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేయలేదు. జార్జి కురియన్ సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని మంగళవారం రాష్ట్రపతి భవన్ అధికారికంగా ధ్రువీకరించింది. ఇప్పటివరకు జార్జి కురియన్ కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా, మత్స్య, పాడి పరిశ్రమలు మరియు పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన సహాయ మంత్రి హోదాలో కూడా సేవలందించారు.
వివరాలు
జూన్ 21తో రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ముగింపు
ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఏకైక క్రిస్టియన్ మంత్రి కురియన్ కావడం విశేషం. ఆయన రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం జూన్ 21తో ముగిసింది. అలాగే మరో కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టును కూడా ఈసారి భాజపా రాజ్యసభకు నామినేట్ చేయకపోవడం గమనార్హం.