Union Budget 2025: నేడు కేంద్ర బడ్జెట్ 2025-26.. లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, ఈ రోజు (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు, మధ్య తరగతి వర్గాలు, వేతన జీవులు, పారిశ్రామిక వేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈసారి బడ్జెట్‌లో ఏమి ఉండొచ్చన్న దానిపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా, ఆదాయపు పన్ను విధానాన్ని సరళీకరించడంతో పాటు, ప్రస్తుతం ఉన్న పన్ను శ్లాబ్స్‌ను 6 నుండి 3కు తగ్గించే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది.
గరిష్ఠ పన్ను రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించనున్నట్టు సమాచారం.
వివరాలు
జన్‌ధన్ యోజన, ముద్రా యోజన పథకాలకు నిధులు
మహిళల సాధికారతను మెరుగుపరచేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పెంచడంతో పాటు, జన్‌ధన్ యోజన, ముద్రా యోజన వంటి పథకాలకు మరింత నిధులు కేటాయించే అవకాశం ఉంది.
మార్చిలో ముగియనున్న మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ గడువును పొడిగించే లేదా దానికి బదులుగా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంచనా.
అంతేగాక, సౌర విద్యుత్తును ప్రోత్సహించేందుకు 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ' పథకానికి కేటాయింపులను పెంచనున్నట్టు సమాచారం.
గ్రామీణ ప్రాంతాల్లో పేదల కోసం 'హౌసింగ్ ఫర్ ఆల్' కార్యక్రమంలో మరింత సహాయం అందించనున్నారు.
అదేవిధంగా, పట్టణాల్లో 2029 నాటికి కోటి మంది పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఇళ్ల నిర్మాణ సహాయాన్ని ఈ బడ్జెట్‌లో ప్రకటించే అవకాశముంది.