LOADING...
Chhattisgarh High Court: భార్య అనుమతి లేకుండా భర్త చేసిన అసహజ సెక్స్ నేరం కాదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు
భార్య అనుమతి లేకుండా భర్త చేసిన అసహజ సెక్స్ నేరం కాదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు

Chhattisgarh High Court: భార్య అనుమతి లేకుండా భర్త చేసిన అసహజ సెక్స్ నేరం కాదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2025
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. భార్య అనుమతి లేకుండా ఆమెతో అసహజ శృంగారానికి పాల్పడటం నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. 2017లో బస్తర్‌ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన భార్యతో అసహజ శృంగారానికి పాల్పడి, ఆ తరువాత ఆమె మరణించడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మృతురాలి మేజిస్ట్రేట్‌ ఎదుట ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని జగదల్‌పుర్‌లోని అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

వివరాలు 

భార్య వయసు 15 ఏళ్లు దాటి ఉన్నప్పుడు..

జస్టిస్‌ నరేంద్రకుమార్‌ వ్యాస్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించి, 2013లో భారత శిక్షాస్మృతిలో (ఐపీసీ) సెక్షన్‌ 375కి చేసిన సవరణ ప్రకారం నిందితుడి చర్యను నేరంగా పరిగణించలేమని తీర్పు ఇచ్చింది. భార్య వయసు 15 సంవత్సరాలు దాటి ఉన్నప్పుడు భర్త చేసే ఏ విధమైన లైంగిక చర్యనైనా అత్యాచారంగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది. అంతేగాక, ఈ సందర్భంలో సమ్మతి అనేది కీలకంగా భావించదలచుకోలేమని పేర్కొంది. దీని ఆధారంగా హైకోర్టు నిందితుడిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.