LOADING...
Telangana: తెలంగాణలో విభిన్న వాతావరణం.. ఎండలతో పాటు అకాల వర్షాలు
తెలంగాణలో విభిన్న వాతావరణం.. ఎండలతో పాటు అకాల వర్షాలు

Telangana: తెలంగాణలో విభిన్న వాతావరణం.. ఎండలతో పాటు అకాల వర్షాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 20, 2026
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండలు తీవ్రంగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండగా, మరోవైపు అకాల వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం, మంగళవారం రోజుల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.

వివరాలు 

క్యుములోనింబస్ మేఘాల కారణంగా పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం

ఇదే సమయంలో ద్రోణి ప్రభావంతో పాటు క్యుములోనింబస్ మేఘాల కారణంగా పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాలతో పాటు మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఈ వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు లేదా ఉక్కపోతలో పెద్దగా మార్పు ఉండదని స్పష్టం చేసింది.

Advertisement