
హిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు: ఎంపీ సంచలన కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీ దయానిధి మారన్ సంచలన కామెంట్స్ చేశారు.
ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడేవారి గురించి కీలక ప్రకటన చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి హిందీ మాట్లాడే వారు టాయిలెట్లు, రోడ్లు శుభ్రం చేసేందుకు తమిళనాడుకు వస్తున్నారన్నారు.
వారికి హిందీ మాత్రమే వచ్చు అని, ఇంగ్లీషులో మాట్లాడటం రాదన్నారు.
ఇంగ్లీషు నేర్చుకునే వారికి ఐటీ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు లభిస్తాయని మారన్ అన్నారు. మారన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తమిళనాడు
దయానిధి మారన్ కామెంట్స్‌ను ఖండించిన తేజస్వీ
దయానిధి మారన్ కామెంట్స్‌పై బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ స్పందించారు.
దేశం మొత్తం బిహార్, యూపీ నుంచి వెళ్తున్న కార్మికులే పని చేస్తున్నారన్నారు.
వారు వెళ్లకపోతే, ఇతర రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోతుందన్నారు. మారన్ చేసిన కామెంట్స్‌ను తేజస్వీ యాదవ్ ఖండించారు.
ఇతర రాష్ట్ర నాయకులు ఇలాంటి ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
భారత్ ఒక దేశమని, ఇతర రాష్ట్రాలను తాము గౌరవిస్తామని, వారు కూడా తమను గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు.
బిహార్ ప్రజలను అవమానించడం మానేయాలని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు.