Page Loader
Rs 17.5 crore injection: 15నెలల రైతు బిడ్డకు రూ.17 కోట్ల ఇంజెక్షన్‌ 
Rs 17.5 crore injection: 15నెలల రైతు బిడ్డకు రూ.17 కోట్ల ఇంజెక్షన్‌

Rs 17.5 crore injection: 15నెలల రైతు బిడ్డకు రూ.17 కోట్ల ఇంజెక్షన్‌ 

వ్రాసిన వారు Stalin
Dec 18, 2023
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌ సహరాన్‌పూర్‌లో 15 నెలల ఒక పేద రైతు కొడుకుకు దిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందు ఇంజెక్షన్‌ను అందించారు. నాలుగు నెలల వయసు నుంచి వెన్నెముక కండరాల క్షీణత (SMA) టైప్-వన్‌తో చిన్నారి భుదేవ్ శర్మ బాధపడుతున్నారు. ఈ వ్యాధి నయం కావాలంటే.. రూ. 17.5 కోట్లు విలువైన జోల్జెన్స్మా ఇంజెక్షన్‌ ఇవ్వాల్సి వచ్చింది. అయితే బాలుడి తల్లిదండ్రులు నిరుపేదలు. రైతు కుటుంబం కావడంతో అంత మొత్తాన్ని భరించే స్థితిలో లేరు. ఈ క్రమంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రచారాన్ని చేపట్టగా.. బాలుడి ఇంజెక్షన్‌ కోసం పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. అలాగే కేంద్రం కూడా అండగా నిలిచింది.

దిల్లీ

ఈ ఇంజెక్షన్‌ తీసుకున్న 19వ చిన్నారి భూదేవ్ 

కేంద్రం ఇంజెక్షన్‌కు దిగుమతి సుంకాన్ని మనహాయించడంతో రూ.17 కోట్ల ఇంజెక్షన్‌ విలువ రూ.10 కోట్లకు తగ్గింది. దీంతో అందరి సహకారంతో బాలుడికి ఇంజెక్షన్‌ను ఇచ్చారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స కొనసాగుతోంది. బాలుడిని వైద్యులు ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. SMA టైప్-వన్ అనేది పిల్లల్లో చాలా అరుదుగా కనిపించే వ్యాధి. ఇది అరుదైన జన్యుపరమైన రుగ్మత . ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడు సాధారణంగా రెండేళ్లలో చనిపోతారు. దిల్లీ ఎయిమ్స్‌లోని చైల్డ్ న్యూరాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ షెఫాలీ గులాటీ మాట్లాడుతూ.. ఈ ఇంజెక్షన్‌ తీసుకున్న 19వ చిన్నారి భూదేవ్ అని పేర్కొన్నారు. ఇంతకుముందు తీసుకున్న వారందరికీ మంచి ఫలితాలు వచ్చినట్లు చెప్పారు.