Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో స్నానం ఆచరించిన యూపీ కేబినెట్
ఈ వార్తాకథనం ఏంటి
మహా కుంభమేళాలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, కేబినెట్ మంత్రులు త్రివేణి సంగమంలో బుధవారం పవిత్ర స్నానాలు ఆచరించారు.
అందుకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి స్నానాలు చేశారు.
అదేవిధంగా కొద్దిసేపు ఒకరిపై ఒకరు నీళ్లు పోసుకొని సరదాగా గడిపారు. ఈ క్రమంలో మంత్రులు, ముఖ్యమంత్రితో సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, అనేక కీలక ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించారు.
వివరాలు
ప్రయాగ్‌రాజ్,పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై దృష్టి
ముఖ్యంగా గంగానదిపై ఆరు లైన్ల వంతెన నిర్మించే నిర్ణయం తీసుకున్నారు.
ప్రయాగ్‌రాజ్-చిత్రకూట్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
ప్రయాగ్‌రాజ్,పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించారు.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ప్రయాగ్‌రాజ్‌ను మిర్జాపూర్, భదోహి, కాశీ, చందౌలీతో కలుపుతూ, ఘాజీపూర్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను గంగా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా అనుసంధానం చేస్తూ, దీన్ని పొడిగించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అనంతరం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, 54 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గం పవిత్ర స్నానాలు చేశారు.ఇలా చేయడం ఇది రెండోసారి కావడం విశేషం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జలకలాట లాడుతున్న సీఎం యోగి, మంత్రులు
VIDEO | Maha Kumbh 2025: UP CM Yogi Adityanath (@myogiadityanath) along with other cabinet ministers take a holy dip in the Sangam, Prayagraj.
— Press Trust of India (@PTI_News) January 22, 2025
(Full video available on PTI Videos: https://t.co/n147TvrpG7) pic.twitter.com/DIvA6Krz3i