UP Gang rape: దళిత మహిళపై నలుగురు గ్యాంగ్ రేప్.. కట్టేసి, నోట్లో గుడ్డలు పెట్టి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో దారుణం జరిగింది. దేవా ప్రాంతంలో నలుగురు దుండగులు దళిత మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.
ఈ మేరకు ఆ నలుగురు నిందుతులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితులు సోమవారం తన భర్తతో గొడవ పడింది.
ఈ క్రమంలో అత్తమామలపై కొపంతో పుట్టింటికి కాలినడకన వెళ్తున్న క్రమంలో నలుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు.
రోడ్డుపై నిలబడి ఉన్న తనను బిషన్‌పూర్ నుంచి కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారని బాధితురాలు తెలిపింది.
అనంతరం ఓ ఇంట్లో బంధించి అర్థరాత్రి వరకు ఒకరి తర్వాత ఒకరు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.
అత్యాచారం
కోడలు ఇచ్చిన సమాచారంతో..
అత్యాచారం చేసే సమయంలో తన నోటిని గుడ్డతో కట్టారని బాధితురాలు వాపోయింది.
ఆమె కేకలు వేయడంతో నిందితులు చంపేస్తామని బెదిరించారు.
ఈ క్రమంలో బాధిత మహిళ తన మొబైల్ ఫోన్ ద్వారా తన కోడలికి సమాచారం అందించింది.
కోడలు సమాచారంతో పోలీసులు రాత్రి 1గంట సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇంటి తలుపు బయటి నుంచి తాళం వేసి ఉంది. పోలీసులు తాళం పగులగొట్టి లోపలి నుంచి మహిళను రక్షించారు.
ఈ సమయంలో గది లోపల ఉన్న నిందితుల్లో ఒకరైన మొఘల్ ఆజం అలియాస్ రియాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
మహిళ ఫిర్యాదు మేరకు రియాజ్, భురే, షబ్బు, ఇస్లాముద్దీన్‌లపై సామూహిక అత్యాచారం, బెదిరింపులు, దాడి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.