NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Honeytrap: అమ్మాయి ట్రాప్ లో పడి పాక్‌కు మిలిటరీ రహస్యాలను లీక్‌.. వ్యక్తిని అరెస్టు 
    తదుపరి వార్తా కథనం
    Honeytrap: అమ్మాయి ట్రాప్ లో పడి పాక్‌కు మిలిటరీ రహస్యాలను లీక్‌.. వ్యక్తిని అరెస్టు 
    అమ్మాయి ట్రాప్ లో పడి పాక్‌కు మిలిటరీ రహస్యాలను లీక్‌.. వ్యక్తిని అరెస్టు

    Honeytrap: అమ్మాయి ట్రాప్ లో పడి పాక్‌కు మిలిటరీ రహస్యాలను లీక్‌.. వ్యక్తిని అరెస్టు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 14, 2025
    03:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రవీంద్ర కుమార్ ఫిరోజాబాద్‌లోని హజ్రత్‌పుర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు.

    2023లో నేహా శర్మ అనే మహిళ ఫేస్‌బుక్ ద్వారా అతనికి పరిచయమైంది. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (Pak ISI) కోసం పనిచేస్తున్న ఆమె, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి రవీంద్రతో స్నేహం చేసింది.

    డబ్బుల ఆశ చూపుతూ అతడిని ప్రేమ ప్రలోభాలకు గురి చేసింది. ఈ క్రమంలో అతడి నుంచి మిలిటరీ రహస్యాలను (Military Secrets) సేకరించినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు.

    రవీంద్ర, నేహా శర్మ నంబరును "చంద్రన్ స్టోర్‌కీపర్" అనే పేరుతో సేవ్ చేసుకుని, వాట్సాప్ ద్వారా ఆమెకు పలు కీలక పత్రాలను పంపించినట్లు గుర్తించారు.

    వివరాలు 

    వాట్సాప్ చాట్‌లను పరిశీలిస్తున్న పోలీసులు 

    అతడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, 51 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ అధికారుల నిర్వహించిన లాజిస్టిక్స్ డ్రోన్ పరీక్షలు, రోజువారీ ఉత్పత్తి వివరాలు, స్క్రీనింగ్ కమిటీ పంపిన రహస్య లేఖలను సేకరించి, వాటిని ఆమెకు పంపినట్లు తెలుస్తోంది.

    ముఖ్యంగా, గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలు కూడా అందించినట్లు పోలీసులు వెల్లడించారు.

    అంతేకాకుండా,అతడు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్‌ఐ సభ్యులతో నేరుగా టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

    భారత రక్షణ రంగ ప్రాజెక్టులకు సంబంధించిన గూఢ సమాచారం వారికీ అందించివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

    నిందితుడితో పాటు అతడి స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.వారి వాట్సాప్ చాట్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చైనా
    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ
    IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!   బీసీసీఐ
    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు హర్యానా

    ఉత్తర్‌ప్రదేశ్

    FIITJEE Coaching Center: టీచర్ల జీతాలు చెల్లించకపోవడంతో యూపీ, ఢిల్లీలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత‌ దిల్లీ
    Uttar Pradesh: తాగుబోతు భర్తల నుంచి విముక్తి.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు భారతదేశం
    Mamta Kulkarni: మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న అగ్రనటి మమతా కులకర్ణి బాలీవుడ్
    Mahakumbh Mela: కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్‌ సాయంతో స్వచ్ఛమైన గాలి ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025