Page Loader
Uttar Pradesh: నిద్రిస్తున్న భర్తపై వేడినీళ్లు పోసి.. టెర్రస్‌పై నుంచి తోసేసిన భార్య 
నిద్రిస్తున్న భర్తపై వేడినీళ్లు పోసి.. టెర్రస్‌పై నుంచి తోసేసిన భార్య

Uttar Pradesh: నిద్రిస్తున్న భర్తపై వేడినీళ్లు పోసి.. టెర్రస్‌పై నుంచి తోసేసిన భార్య 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 16, 2024
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య జరిగిన గొడవలో భార్య భర్తను దారణంగా హింసించింది. బల్లియాలోని సికిందర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లోని లిల్కర్‌లో నివసిస్తున్నఆశిష్ కుమార్ రాయ్ కి, గత ఏడాది మే 27న డియోరియాలోని బంకట పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరిహవాన్‌లో అమృతరాయ్‌తో వివాహం జరిగింది. అయితే, కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్తపై అమృతరాయ్ అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో ఆయనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది.ఈ క్రమంలో ఏప్రిల్ 13 సాయంత్రం, అయన తన భార్య చూడటానికి వెళ్లిన ఆశిష్‌పై అమృత, అత్తమామలు దాడి చేసి, వేడినీళ్లు పోశారు.

Details 

తప్పించుకోడానికి ప్రయత్నించినా ఆశిష్ తల పగలగొట్టారు

అత్తమామలు అతని మొబైల్, మోటార్ సైకిల్ కీలను స్వాధీనం చేసుకున్నారని ఆశిష్ చెప్పాడు. తాళాలు అడిగితే ఆ రోజు అక్కడే ఉండమని చెప్పారని తెలిపాడు.దీనికి అంగీకరించన ఆశిష్ .. ఆ రాత్రి అక్కడే నిద్రపోయాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అమృత వాష్‌రూమ్‌కి వెళ్తానని చెప్పి అప్పటికే ఆమె సోదరి సిద్ధంగా ఉంచిన వేడినీళ్లు తీసుకొచ్చి కుమ్మరించింది. దాంతో తప్పించుకోడానికి ప్రయత్నించినా ఆశిష్ ను పట్టుకుని తలను పగలగొట్టారు.అనంతరం డాబాపై నుంచి తోసేశారు. దీంతో అతని కాలికి గాయమైంది. ఆశిష్ శబ్దం విని చుట్టుపక్కల వారు గుమిగూడారు. వారిలో ఒకరు పోలీసులకు సమాచారం అందించారు.

Details 

పోలీసుల అదుపులో భార్య 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆశిష్‌ను ఆస్పత్రికి తరలించారు. భార్య తన భర్తపై వేడినీరు ఎందుకు పోసింది? దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇరువర్గాల వారు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. భర్త వివాహేతర సంబంధాలపై భార్య అనుమానిస్తోందని కొందరు అంటుండగా.. సోదరుడి నుంచి విడివిడిగా జీవించాలని భర్తపై భార్య ఒత్తిడి చేస్తోందని కొందరు అంటున్నారు. కొంతకాలం క్రితం, తన బావ తనను కొట్టాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. పోలీసులు ఆశిష్ ను డియోరియా మెడికల్ కాలేజీలో ఎమర్జెన్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడైన భార్యను అదుపులోకి తీసుకున్నారు.