LOADING...
Uttarpradesh: విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.. యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం
విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.

Uttarpradesh: విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.. యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 14, 2024
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లో విద్యార్థుల ఆందోళనలతో యోగి ప్రభుత్వం స్పందించింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా యూపీపీఎస్సీ (యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలను ఒకే రోజు నిర్వహించాలని పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఈ ఆందోళనలు కొన్ని రోజులుగా పెరుగుతున్న నేపథ్యంతో, యోగి సర్కార్ పరిస్థితిని గమనించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. యూపీపీఎస్సీ ఛైర్మన్ సంజయ్ శ్రీ నెత్ ఆధ్వర్యంలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, 2024 ప్రిలిమినరీ పరీక్షలను ఒకే రోజులో నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు.

వివరాలు 

ద్యార్థుల ఆందోళనలకు ఓ పరిష్కారం

ముఖ్యంగా, పీసీఎస్, ఆర్వో, ఏఆర్వో పరీక్షలన్నీ ఒకే రోజు నిర్వహించాలని విద్యార్థులు కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కమిషన్ గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను పునఃసమీక్షించి, వాటిని రద్దు చేసే నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం విద్యార్థుల ఆందోళనలకు ఓ పరిష్కారం కావచ్చు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విద్యార్థుల ఆందోళన