LOADING...
Bomb Threats: చెన్నైలో కలకలం.. సీఎం స్టాలిన్‌, విజయ్‌ నివాసాలకు బాంబు బెదిరింపులు!
చెన్నైలో కలకలం.. సీఎం స్టాలిన్‌, విజయ్‌ నివాసాలకు బాంబు బెదిరింపులు!

Bomb Threats: చెన్నైలో కలకలం.. సీఎం స్టాలిన్‌, విజయ్‌ నివాసాలకు బాంబు బెదిరింపులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2025
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాజధాని చెన్నైలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. మొదట అల్వార్‌పేటలోని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి, ఆపై నీలంకరైలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ నివాసానికి కూడా బాంబు బెదిరింపు కాల్స్‌ వచ్చినట్టు చెన్నై పోలీసులు వెల్లడించారు. విఘ్నేష్ అనే వ్యక్తి చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి, స్టాలిన్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యేలోపు ఆయన ఇంట్లో బాంబు పేలుస్తామంటూ చెప్పాడు. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌ సీఎం నివాసానికి చేరుకుని పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టింది. కానీ ఎలాంటి పేలుడు పదార్థాలు అక్కడ లభించలేదు.

Details

ఫేక్ కాల్ గా నిర్ధారణ

ఇది పూర్తిగా ఫేక్ కాల్‌ అని నిర్ధారించారు. అయినప్పటికీ, సీఎం నివాస పరిసరాల్లో భద్రతను బలోపేతం చేశారు. తర్వాత టీవీకే అధినేత విజయ్ ఇంటికి కూడా ఇలాంటి బెదిరింపు కాల్‌ రావడంతో పోలీసులు మరోసారి బాంబ్ స్క్వాడ్‌, స్నిఫర్ డాగ్స్‌ సహాయంతో గాలింపు చేపట్టారు. అక్కడ కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు కనపడలేదు. ఈ కాల్ కూడా నకిలీదే అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ రెండు ఫేక్ కాల్స్ వెనుక ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఫోన్‌ నంబర్ ఆధారంగా విచారణ జరిపి, నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని చెబుతున్నారు.