LOADING...
Haryana: హాస్టల్‌లో కలకలం.. సూట్‌కేసులో గర్ల్‌ఫ్రెండ్‌ను దాచిన యువకుడు (వీడియో)
హాస్టల్‌లో కలకలం.. సూట్‌కేసులో గర్ల్‌ఫ్రెండ్‌ను దాచిన యువకుడు (వీడియో)

Haryana: హాస్టల్‌లో కలకలం.. సూట్‌కేసులో గర్ల్‌ఫ్రెండ్‌ను దాచిన యువకుడు (వీడియో)

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2025
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవాలనే ఉద్దేశంతో అతి విచిత్రమైన మార్గాన్ని ఎంచుకుని తానే ఓ పెద్ద సాహసానికి పాల్పడ్డాడు. ఏకంగా తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెద్ద సూట్‌కేసులో కూర్చోబెట్టి, ఎవరికీ తెలియకుండా బాయ్స్‌ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి తీరుపై హాస్టల్ సిబ్బందికి అనుమానం రావడంతో అసలైన విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో అది వేగంగా వైరల్‌గా మారింది. ఈఘటన హర్యానా రాష్ట్రంలోని సోనిపట్‌ ప్రాంతంలో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయం (OP Jindal University)లో చోటు చేసుకుంది. ఓ విద్యార్థి పెద్ద సూట్‌కేసుతో హాస్టల్‌లోకి వస్తుండగా, సిబ్బంది అందులో ఏముందని అడిగారు. దానికి అతడు దుస్తులు, ఇతర వ్యక్తిగత వస్తువులున్నాయని చెప్పాడు.

Details

విచారణ జరుపుతున్న యూనివర్సిటీ యాజమాన్యం

కానీ అతడి ప్రవర్తనపై హాస్టల్ గార్డులకు అనుమానం రావడంతో వారు సూట్‌కేస్ తెరవాలని అడిగారు. కానీ విద్యార్థి వారిని నిరాకరించాడు. దాంతో విషయం ఉన్నతాధికారులకు చేరవేయగా, వారు అక్కడికి వచ్చి సూట్‌కేస్‌ను తెరవగా అందులో ఆశ్చర్యకరంగా ఓ యువతి బయటపడింది. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ విద్యార్థి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ట్రెండ్ అయ్యింది. అయితే సూట్‌కేసులో బయటపడిన అమ్మాయి అదే యూనివర్సిటీలో చదువుతుందా లేక బహిర్గత వ్యక్తి అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం యూనివర్సిటీ యాజమాన్యం విచారణ జరుపుతోందని అధికారికంగా వెల్లడించారు. నెటిజన్ల స్పందిస్తూ ఈ మధ్య సూట్‌కేసులు ఎన్నో పనులకు పనికొస్తున్నట్టు ఉంది'' అని చమత్కరించారు.