
యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల; అమ్మాయిలే టాప్, తెలుగు వాళ్లు సత్తా
ఈ వార్తాకథనం ఏంటి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
ఈ ఫలితాల్లో అమ్మాయిలు మొదటి నాలుగు స్థానాలను సాధించి సత్తా చాటారు.
ఇషితా కిషోర్ ఆల్ ఇండియా ర్యాంక్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించగా, గరిమా లోహియా, ఉమా హారతి, స్మృతి మిశ్రా తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నారు.
ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ ఏ, గ్రూప్ బీ కేటగిరీల్లో వివిధ ప్రభుత్వ సర్వీసులకు కలిపి మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.
అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో చూసుకోవచ్చు.
ఫలితాలు
అదరగొట్టిన తెలుగు అభ్యర్థులు
యూపీఎస్‌సీ పరీక్షల్లో తెలంగాణ, ఏపీకి చెందిన అభ్యర్థులు అదరగొట్టారు. జీవీఎస్ పవన్ దత్తా 11వ ర్యాంకు, శాఖమూరి అర్షిత్ 40వ ర్యాంకు, ఆవుల సాయికృష్ణ, 94వ ర్యాంకు, అనుగు శివ మారుతీ రెడ్డి 132 ర్యాంకు, రాళ్లపల్లి వసంత్ 157వ ర్యాంకు, కమతం మహేశ్ కుమార్ 200వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 217 వ ర్యాంకు సాధించారు.
500 ర్యాంకుల లోపు అభ్యర్థులు చాలా మందే ఉన్నారు. యూపీఎస్‌సీ సీఎస్‌ఈ ప్రిలిమినరీ పరీక్ష జూన్ 5, 2022న నిర్వహించారు.
ఈ ఫలితాలు జూన్ 22న విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు జరిగింది. దీని ఫలితాలు డిసెంబర్ 6న ప్రకటించారు. ఇంటర్వ్యూలు మే 18న ముగిశాయి.
EMBED
ఆల్ ఇండియా ర్యాంక్ నెంబర్ వన్ ర్యాంకర్ ఇషితా కిషోర్
UPSC declares 2022 Civil Services Exam results. Ishita Kishore, Garima Lohia and Uma Harathi N secure the top three ranks, respectively pic.twitter.com/ulJZnG7JBi— ANI (@ANI) May 23, 2023