LOADING...
UPSC Civil Services Exam : యూపీఎస్సీ సివిల్స్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. 
యూపీఎస్సీ సివిల్స్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల..

UPSC Civil Services Exam : యూపీఎస్సీ సివిల్స్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2025
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. అఖిల భారత సర్వీసుల పరిధిలో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. ఈ పరీక్షకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 సాయంత్రం 6గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయి. ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరుగనుంది. అదనంగా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ పరిధిలో మరో 150 పోస్టుల భర్తీ కోసం కూడా UPSC విడిగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు సమర్పించడానికి కూడా చివరి తేదీ ఫిబ్రవరి 11.

వివరాలు 

ఈ నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి

విద్యార్హతలు:అభ్యర్థులు గుర్తింపు పొందిన ఏదైనా విద్యాసంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయో పరిమితి: అభ్యర్థుల వయసు 21 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి.ఆయా రిజర్వేషన్ కేటగిరీలకు అనుగుణంగా వయో పరిమితి సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుం: ఓబీసీ,జనరల్ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి, అయితే మహిళలు,ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు రుసుము మినహాయింపు ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష: మొత్తం రెండు పేపర్లకు (400 మార్కులు) నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. మరియు తప్పు సమాధానాల కోసం నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హత పొందుతారు.

వివరాలు 

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు

మెయిన్స్ పరీక్ష: డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతుంది. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరవుతారు. చివరగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్, వరంగల్‌లో ఉన్నాయి. మెయిన్స్ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడలో ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది.