LOADING...
#NewsBytesExplainer: అర్బన్ నక్సల్స్ వల్లే … ప్రాణాలు కోల్పోతున్న మావోయిస్టులు
అర్బన్ నక్సల్స్ వల్లే … ప్రాణాలు కోల్పోతున్న మావోయిస్టులు

#NewsBytesExplainer: అర్బన్ నక్సల్స్ వల్లే … ప్రాణాలు కోల్పోతున్న మావోయిస్టులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాలం మారిపోయింది.. ప్రపంచం మారిపోయింది.. ఇప్పటికీ అడవుల్లో దాక్కొని పోరాటం చేస్తామని అనుకుంటే, అక్కడి జీవితం చివరికి ప్రాణాలు కోల్పోవడం తప్ప ఇంకేమీ ఉండదు. ఈ వాస్తవాన్ని తాజాగా లొంగిపోయిన అగ్ర నాయకుడు మల్లోజుల బహిరంగంగా చెప్పుతున్నారు. సహచరులు బయటికి రావాలని అనుకుంటే తన మొబైల్ నెంబర్‌కు సంప్రదించొచ్చని ప్రకటించారు. వాళ్ల ప్రాణాలు రక్షించాలన్న ఆకాంక్షతో ఇలా పిలుపునిస్తున్నారు. కానీ బయట నగరాల్లో సుఖసౌకర్యాల మధ్య ఉండే అర్బన్ నక్సల్స్ మాత్రం, తుపాకీని వదలొద్దని, పోరాటం ఆపొద్దని రెచ్చగొడుతూనే ఉన్నారు.

 నక్సల్స్ 

అర్బన్ నక్సల్స్ విలాసవంతమైన జీవనం 

అడవుల్లో తిరిగే నక్సలైట్లు కష్టసుఖాలు అనుభవిస్తూ, చెట్ల మధ్య, పుట్టల మధ్య ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. తాము ప్రత్యామ్నాయ ప్రభుత్వమని భావిస్తూ పోరాటం చేస్తున్నారు. కానీ వీళ్ల వెనుక నిలబడి నడిపే అర్బన్ నక్సల్స్ మాత్రం ఉత్తేజపూరిత ప్రసంగాలతో అగ్గి రాజేస్తుంటారు. "పీడిత వర్గాల కోసం పోరాడుతున్నాం, ముందుకు రండి" అంటూ. తాము ఉన్నత కులాల వ్యక్తులైనా, అన్నీ వదిలేసి మీ కోసం నిలబడుతున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ అర్బన్ నక్సల్స్ ది విలాసవంతమైన జీవితం.

నమ్మకం 

వీరిని నమ్మి నట్టేట మునుగుతున్న మావోయిస్టులు 

అడవుల్లో ఉన్న మావోయిస్టులు వీరి మాటలే నమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు. బయట పరిస్థితులు అర్థం కాక సిద్ధాంతం పేరుతో తమ ప్రాణాలనే త్యాగం చేస్తున్నారు. ఎన్‌కౌంటర్లు పెరుగుతూనే ఉన్నాయి. హిడ్మా ఒక జర్నలిస్టుకు రాసిన లేఖ బయటకొచ్చిన తర్వాత, పార్టీకి ఆయన ఆశాకిరణమని, ఇంకో ప్రభాకరన్‌లా అవుతారని అర్బన్ నక్సల్స్ అతన్ని ప్రేరేపించినట్టు స్పష్టమైంది. కానీ చివరికి ఆయన కూడా ఎన్‌కౌంటర్‌కే గురయ్యారు. వయసైన ఇతర నాయకులకు కూడా ఇదే పరిస్థితి ఎదురుకానుంది.. లొంగిపోకపోతే అదే జరుగుతుంది.

నిజం 

అర్బన్ నక్సల్స్ నిజాలెందుకు చెప్పరు ? 

ప్రపంచం మారిపోయిందని, దాక్కొని చేసే ఉద్యమాలు ఇక పని చేయవని మల్లోజుల వేణుగోపాల్ స్పష్టంగా చెబుతున్నారు. అడవుల్లో నుంచి బయటపడ్డాకే ఆయన ఈ నిజాన్ని గ్రహించారు. కానీ అర్బన్ నక్సల్స్ మాత్రం ఈ కీలక విషయాన్ని నక్సలైట్లకు చెప్పరు. లొంగిపోతే ప్రాణాలు నిలుస్తాయని కూడా వివరించరు. అలాంటి మార్గాలు, చానల్స్ సృష్టించడంలో కూడా ఆసక్తి చూపరు. ఫలితంగా ఎంతమందో చనిపోతున్నారు. దీన్నంతా ప్రేరేపిస్తూ ఉండే ఆ అర్బన్ నక్సల్స్‌ ధోరణే ప్రధాన కారణం.