US Visa: అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ రీ షెడ్యూల్‌కి వీలుగా నిబంధనల్లో మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ తేదీని ఎంచుకున్న తరువాత ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు (రీ షెడ్యూల్) వీలుగా నిబంధనల్లో మార్పులు చేసినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటివరకు, నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ తేదీని ఖరారు చేసిన తర్వాత మూడుసార్లు వరకు తేదీలు లేదా ఇంటర్వ్యూకు హాజరయ్యే ప్రాంతాలను మార్చుకోవచ్చు.
దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు, హైదరాబాద్, ముంబయి, చెన్నై, కోల్‌కతా నగరాల్లోని కాన్సులేట్ కార్యాలయాల్లో ఎక్కడైనా వీసా ఇంటర్వ్యూ స్థానాన్ని ఎంచుకొని హాజరుకావచ్చు.
కానీ, తాజా నిబంధనల ప్రకారం, ఇకపై ఒక్కసారి మాత్రమే ఇంటర్వ్యూ తేదీని, హాజరయ్యే ప్రాంతాన్ని మార్చుకోవాలి.
వివరాలు
కొత్త నిబంధనలు జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి..
అంతకు మించి మార్పులు చేసుకోవాలంటే, మరోసారి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా, నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తు ఫీజు 185 అమెరికన్ డాలర్లు చెల్లించాలి.
అర్జీదారులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ మార్పులు తీసుకువచ్చినట్లు అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.
ఈ కొత్త నిబంధనలు 2025, జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.