
BANARAS : బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఘోరం.. విద్యార్థిని దుస్తులు విప్పించిన ముగ్గురు దుండగులు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఓ విద్యార్థినిపై తీవ్ర వేధింపులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు లైంగికంగా వేధించారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) - బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో దుశ్యాసన పర్వం జరిగింది.
బైక్‌పై వచ్చిన ఓ ముగ్గురు దుండగులు ఓ విద్యార్థిని దుస్తులు లాగి లైంగికంగా వేధించారు. పైగా ఈ ఘటనను వీడియో తీసినట్లు సమాచారం. సదరు విద్యార్థిని వసతి గృహానికి సమీపంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది.
వర్సిటీకి చెందిన విద్యార్థిని బుధవారం రాత్రి తన స్నేహితురాలితో బయటకు వెళ్లింది. వారిద్దరూ కర్మన్ బాబా ఆలయం వద్ద ఉండగా ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చారు.
DETAILS
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి : విద్యార్థులు
ఈ క్రమంలోనే ఆమె ఫ్రెండ్‌ను బెదిరింపులకు గురిచేసి బాధితురాలిని ఓ మూలకు బలవంతంగా ఈడ్చుకెళ్లారు.
అనంతరం నిందితులు విద్యార్థిని దుస్తులు తొలగించి సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి దారుణానికి ఒడిగట్టారు.
దాదాపు 15 నిమిషాల తర్వాత బాధితురాలి ఫోన్ నంబర్ తీసుకుని విడిచిపెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తనపై జరిగిన వేధింపులపై బాధితురాలు సమీపంలోని పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ముమ్ముర గాలింపు చర్యలు చేపట్టారు.
దీంతో విశ్వ విద్యాలయంలో ఆగ్రహం పెల్లుబికింది. వందలాది స్టూడెంట్స్ వసతిగృహం వద్ద ఆందోళన చేపట్టారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించాలని ముక్తంకంఠంతో డిమాండ్ చేశారు.