Loading...
Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం.. 
యోగి ఆదిత్యనాథ్ తల్లి కన్నుమూత

Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తల్లి సావిత్రీ దేవి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని సీఎం సోదరుడు మహేంద్ర ధ్రువీకరించారు. ఈటీవీ భారత్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. సావిత్రీ దేవి మరణించినట్లు వెల్లడించారు. సావిత్రీ దేవి గృహిణి. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్వాల్‌ జిల్లాలో ఉన్న పంచూర్‌ గ్రామంలో ఆమె నివసించేవారు. గత కొన్ని నెలలుగా ఆమె ఆరోగ్యం పలుమార్లు క్షీణించింది. ఈ క్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆసుపత్రికి వెళ్లి తల్లిని పరామర్శించారు. తాజాగా ఆమె కన్నుమూయడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తల్లి సావిత్రీ దేవి కన్నుమూత

ADVERTISEMENT