
యూపీ : గ్రామ పనులకు సహకరించాలని కోరితే, కార్యాలయంలోనే శిక్ష విధించాడో అధికారి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లో అమానుషం చోటు చేసుకుంది. సాయం కోరి వచ్చిన బాధితుడ్ని తన కార్యాలయంలోనే శిక్ష విధించాడో ఓ అధికారి. ఆపై తన నోటికి పనిచెప్పారు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.దీంతో సదరు అధికారిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించేశారు.
బరేలీ జిల్లాలోని మీర్‌గంజ్ పట్టణానికి చెందిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఉదిత్ పవార్ సస్పెండ్ అయ్యారు.
గ్రామంలో స్మశానవాటిక నిర్మాణం కోసం అభ్యర్థించేందుకు మూడోసారి వచ్చిన ఓ వ్యక్తిని పవార్ వంగి కూర్చోవాలని శిక్ష విధించారు.
అయితే తాను వచ్చేసరికే అతను వంగి కూర్చున్నాడని, అడిగితే సాయం కావాలన్నాడని పవార్ అన్నారు.మందన్‌పూర్‌లో స్మశాన వాటిక నిర్మాణానికి గ్రామస్తులతో కలిసి వెళ్తే పవార్ తన అర్జీని విసిరేసారని బాధితుడు విలపించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పవార్ ను విధుల నుంచి తప్పించిన ఉన్నతాధికారులు
In UP's Bareilly, a complainant could be seen kneeling down in front of SDM Udit Pawar. pic.twitter.com/RAIQD3Hfss
— Piyush Rai (@Benarasiyaa) September 15, 2023