Uttarkashi tunnel: నార్వే, థాయ్‌లాండ్ నుండి సహాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న 40మంది కార్మికులను రక్షించే ఆపరేషన్ గురువారం ఐదవ రోజుకు చేరుకోవడంతో,అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను రక్షించడానికి థాయ్‌లాండ్, నార్వే నుండి నిపుణుల బృందాల సహాయం తీసుకుంటోంది.ఇప్పుడు 50 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న చెత్త మధ్య 800మిమీ వ్యాసం కలిగిన పైపులు వేస్తున్నారు. శిథిలాల మీదుగా స్టీల్ పైపులు వేసి లోపలి నుంచి కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ మొదటి రెండు రోజులు,అధికారులు పెద్ద ఎక్స్‌కవేటర్‌లను ఉపయోగించారు. సాంకేతిక లోపాలతో అవి శిథిలాలు తొలగించడంలో విఫలమయ్యాయి. ప్రస్తుతానికి పైపుల ద్వారానే కార్మికులతో సంభాషణలు జరుగుతున్నాయి.కార్మికులను ఎట్టిపరిస్థితుల్లోనూ సురక్షితంగా బయటకు తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది.
యువ ఫుట్‌బాల్ ఆటగాళ్లను రక్షించిన థాయ్ టీం
2018లో థాయ్‌లాండ్‌లోని థామ్ లుయాంగ్ నాంగ్ నాన్‌లోని వరదలకు గురైన గుహ నుండి 12 మంది యువ ఫుట్‌బాల్ ఆటగాళ్లను, వారి కోచ్‌ను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడిదే టీమ్ ఉత్తరాఖండ్‌కి చేరుకుంది. థాయ్‌లాండ్‌తో పాటు నార్వే రెస్క్యూ టీమ్ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. రెస్క్యూ ఆపరేషన్ మొదటి రెండు రోజుల్లో, అధికారులు పెద్ద ఎక్స్‌కవేటర్‌లను ఉపయోగించారు. సాంకేతిక లోపాలతో అవి శిథిలాలు తొలగించడంలో విఫలమయ్యాయి. దీనిని అనుసరించి, 35-హార్స్ పవర్ (హెచ్‌పి) ఆగర్ యంత్రాన్ని మోహరించారు. అయినప్పటికీ, శిధిలాలను తొలగించడంలో అది విఫలమవడంతో రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిచిపోయింది. రెస్క్యూ టీమ్ ఇప్పుడు ఢిల్లీ నుండి వచ్చిన 175 హెచ్‌పి ఆగర్ మెషీన్‌పై ఆధారపడుతోంది.