LOADING...
Telangana Vahan Portal: వాహన్ పోర్టల్ స్టార్ట్‌.. ఇంటి నుంచే వాహన సేవలు అందుబాటులోకి!
వాహన్ పోర్టల్ స్టార్ట్‌.. ఇంటి నుంచే వాహన సేవలు అందుబాటులోకి!

Telangana Vahan Portal: వాహన్ పోర్టల్ స్టార్ట్‌.. ఇంటి నుంచే వాహన సేవలు అందుబాటులోకి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో వాహన సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'వాహన్' పోర్టల్ అమలును ప్రారంభించింది. ఈ క్రమంలో రవాణా శాఖ కీలక చర్యలు చేపట్టి, దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవస్థను విస్తరిస్తోంది. అధికారుల ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 68,846 టెంపరరీ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఫ్యాన్సీ నంబర్ మాడ్యూల్ కూడా విజయవంతంగా అమలవుతూ, 1,880 ఫ్యాన్సీ నంబర్లకు ఆన్‌లైన్ రిజర్వేషన్లు నమోదయ్యాయి. నంబర్ల కేటాయింపులో పారదర్శకత పెరగడానికి ఈ వాహన్ ప్లాట్‌ఫారమ్ ఎంతో ఉపయోగపడుతోందని అధికారులు పేర్కొన్నారు.

వివరాలు

 23,705 వాహనాలకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్లు జారీ

ఇక వాహనాల పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగవంతమవుతోంది. ఇప్పటివరకు 23,705 వాహనాలకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్లు జారీ చేసినట్లు వెల్లడించారు. వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి పెండింగ్ కేసులపై ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అమలులో ఎన్‌ఐసీ సాంకేతిక సహకారం అందిస్తోంది. మిగిలిన మాడ్యూల్స్‌ను కూడా దశల వారీగా ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో 15 రోజుల్లో ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో స్థిరపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పారదర్శకతతో కూడిన, సమర్థవంతమైన డిజిటల్ సేవలను ప్రజలకు అందించడం రవాణా శాఖ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement