
Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్!
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడ నుంచి బెంగళూరు వరకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ ప్రాథమికంగా సన్నాహాలు పూర్తి చేసింది.
ఈ మార్గంలో రైలు ప్రయాణ సమయాన్ని తొమ్మిది గంటలుగా నిర్ణయించగా, ప్రస్తుత సమయంతో పోలిస్తే సుమారుగా మూడుగంటల సమయం ఆదా కానుంది.
ఈ కొత్త వందేభారత్ సేవ తీరుగా బెంగళూరును చేరే ప్రయాణికులతో పాటు, తిరుపతి వెళ్లే భక్తులకు కూడా ఎంతో ఉపయోగకరంగా నిలవనుంది.
ఈ రైలు మొత్తం 8 బోగీలతో నడవనుండగా, వాటిలో 7 ఏసీ చైర్‌కార్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ బోగీగా ఉంటాయి. మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ రైలు నడవనుంది.
వివరాలు
ప్రస్తుతం మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్‌కు నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్
రైలు (20711)విజయవాడలో 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28,నెల్లూరు 7.43, తిరుపతి 9.45,చిత్తూరు 10.27,కాట్పాడి 11.13,కృష్ణరాజపురం 13.38,ఎస్‌ఎంవీటీ బెంగళూరు 14.15 గంటలకు చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ రైలు (20712) బెంగళూరులో 14.45 గంటలకు ప్రారంభమై కృష్ణరాజపురం 14.58,కాట్పాడి 17.23, చిత్తూరు 17.49,తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడ 23.45 గంటలకు వస్తుంది.
ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు దిశగా ప్రయాణించే వారికి అందుబాటులో ఉన్న ప్రధాన రైలు మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్‌కు నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్ మాత్రమే.
అది కూడా వారానికి కేవలం మూడ్రోజులే నడుస్తోంది.ఈ నేపథ్యంలో వందేభారత్ రైలు సేవ ప్రారంభమైతే ప్రయాణికులకు వేగవంతమైన, ప్రయాణం లభించనుంది.