Page Loader
Vande Bharat: వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ల రిచ్ లుక్ అదిరిపోయిందిగా.. 
వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ల రిచ్ లుక్ అదిరిపోయిందిగా..

Vande Bharat: వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ల రిచ్ లుక్ అదిరిపోయిందిగా.. 

వ్రాసిన వారు Stalin
Oct 04, 2023
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ రైళ్లను ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన రావడంతో.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో రైల్వేశాఖ స్లీపర్ కోచ్‌లను తీసుకొస్తోంది. అయితే ఈ స్లీపర్ కోచ్‌లు ఎలా ఉంటాయని ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్‌ల ఫొటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విడుదల చేసారు. ఆ ఫొటోలను బట్టి చూస్తే, స్లీపర్‌ కోచ్‌లు ఎంతో రిచ్‌లుక్‌తో ఉంటాయని అర్థం అవుతోంది. చాలా విలాసవంతంగా వీటిని తీర్చిదిద్దారు. వీటిని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంయుక్తంగా తయారు చేశారు. ఈ కోచ్‌లకు ఇంటీరియర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అశ్విని వైష్ణవ్ ట్వీట్