LOADING...
Vande Bharat Sleeper: బుకింగ్స్ మొదలైన గంటల్లోనే అమ్ముడైపోయిన'వందే భారత్ స్లీపర్' రైలు టికెట్లు
బుకింగ్స్ మొదలైన గంటల్లోనే అమ్ముడైపోయిన'వందే భారత్ స్లీపర్' రైలు టికెట్లు

Vande Bharat Sleeper: బుకింగ్స్ మొదలైన గంటల్లోనే అమ్ముడైపోయిన'వందే భారత్ స్లీపర్' రైలు టికెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రైల్వేలో కొత్త విప్లవాన్ని సూచిస్తున్న'వందే భారత్ స్లీపర్'రైలు సాధారణ ప్రయాణికుల నుండి అద్భుతమైన స్పందన పొందింది. ఎంతోకాలం ఎదురుచూస్తున్నఈ స్లీపర్ వెర్షన్ టికెట్లు విడుదలయ్యే కొద్ది గంటల్లోనే అమ్ముడైపోయాయి. ఈవిషయాన్ని రైల్వే శాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. రికార్డు స్థాయిలో టికెట్ బుకింగ్స్ దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 17న మాల్దా టౌన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు అస్సాం రాష్ట్రంలోని కామాఖ్యా (గౌహతి)నుంచి కోల్‌కతా హౌరా స్టేషన్ వరకు ప్రయాణిస్తుంది. కమర్షియల్ ప్రయాణం ఈ రైలుకు జనవరి 22(గురువారం)మొదలవుతుంది. రిజర్వేషన్లు ఓపెన్ చేసిన వెంటనే ప్రయాణికులు పోటీ పడి టికెట్లు బుక్ చేసుకోవడంతో అన్ని సీట్లు నిండిపోయాయి.

వివరాలు 

సమయం ఆదా.. ప్రయాణం హాయి

సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ స్లీపర్ గమ్యస్థానానికి చేరుకునే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. సుమారు 14 గంటల్లోనే ఇది గమ్యానికి చేరుతుంది, అంటే ప్రస్తుత ఇతర రైళ్లతో పోలిస్తే మూడు గంటల ముందే ప్రయాణికులు తమ గమ్యానికి చేరతారు. వారంలో ఆరు రోజులు సేవలందించే ఈ రైలు, గౌహతి-కోల్‌కతా మధ్య ప్రయాణించేవారికి విశేషంగా సౌలభ్యాన్ని అందిస్తుంది.

వివరాలు 

రైల్వే నమ్మకానికి నిదర్శనం

టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవ్వడం భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన ఆధునిక సేవలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని, ఉత్సాహాన్ని తెలియజేస్తోంది.ఈ ప్రాంతంలో ప్రీమియం రైలు కనెక్టివిటీకి ఇది కొత్త అధ్యాయం అని రైల్వే అధికారులు వ్యాఖ్యానించారు. అత్యాధునిక సౌకర్యాలు, వేగం, భద్రత కలిపి, వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో మరిన్ని ప్రధాన నగరాలను కలుపుతూ అందుబాటులోకి రానుంది.

Advertisement