Loading...
Vande Bharat : దసరా నాటికి విజయవాడ డివిజన్‌లో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు
దసరా నాటికి విజయవాడ డివిజన్‌లో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు

Vande Bharat : దసరా నాటికి విజయవాడ డివిజన్‌లో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రైల్వేలో మరో కీలక మార్పుకు శ్రీకారం చుడుతూ వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నడుస్తున్న వందేభారత్‌ రైళ్లు కూర్చుని ప్రయాణించే విధంగా మాత్రమే ఉండగా, ఇప్పుడు తొలిసారిగా స్లీపర్‌ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు వేగవంతం చేసింది. దసరా నాటికి విజయవాడ డివిజన్‌లో ఈ స్లీపర్‌ రైళ్లను పట్టాలెక్కించాలనే లక్ష్యంతో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌, చెన్నై, విశాఖపట్నం మార్గాల్లో సాధారణ వందేభారత్‌ రైళ్లు విజయవంతంగా సేవలు అందిస్తున్నాయి. కొత్తగా రానున్న వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.

వివరాలు 

గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగం

విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలిగేలా బోగీలను ఆధునిక శైలిలో రూపొందించారు.

ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ కోచ్‌లలో అత్యాధునిక ఇంటీరియర్స్‌తో పాటు ఎల్‌ఈడీ లైటింగ్‌, సౌండ్‌ ప్రూఫ్‌ సదుపాయం, వైఫై, మొబైల్‌,ల్యాప్‌టాప్‌ల కోసం ఛార్జింగ్‌ పాయింట్లు, ఆటోమేటిక్‌ డోర్లు ఏర్పాటు చేయనున్నారు.

ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరిచేలా ప్రత్యేక సెన్సర్లను కూడా అమర్చనున్నారు.

ఈ స్లీపర్‌ రైళ్లు గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నారు.

ఒక రైలులో మొత్తం 16 బోగీలు ఉండే అవకాశం ఉందని రైల్వే అధికారులు వెల్లడిస్తున్నారు.

దీంతో సుదూర ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా, వేగంగా మారనున్నాయని భావిస్తున్నారు.

ADVERTISEMENT