
కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా?
ఈ వార్తాకథనం ఏంటి
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు కొత్త రంగులో దర్శనిమమివ్వనుంది. ఇప్పటివరకూ నీలం, తెలుపు రంగులో ఉన్న వందేభారత్ రైళ్లు ఇక కషాయ రంగులోకి మారనున్నాయి. ఈ రైళ్లకు అదనంగా కాషాయ రంగులు వేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.
చైన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో శనివారం కషాయ రంగుతో ఉన్న వందేభారత్ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వందే భారత్ రైలు తెలుపు రంగులో ఉండడం వల్ల దుమ్ము ధూళి ఎక్కువగా అంటుకోవడంతో, దీంతో రంగు మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో వందే భారత్ రైలు ఇక కషాయ రంగులో దర్శనమివ్వనున్నాయి.
Details
జాతీయ జెండా స్ఫూర్తితోనే వందేభారత్ రైళ్లకు కాషాయ రంగు
ఇప్పటి వరకు 25రైళ్లలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయని, జాతీయ జెండా స్ఫూర్తితోనే వందేభారత్ రైళ్లకు కాషాయ రంగు వేయాలని నిర్ణయించుకున్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
త్వరలో పర్యాటక మార్గాలను అనుసంధానం చేస్తూ 'టీ ట్రైన్' లను ప్రవేశపెడతామని, అదే విధంగా దక్షిణాదిలో మరెన్నో వందేభాదర్ రైళ్లను ప్రవేశపెడతామని పేర్కొన్నారు.
చైన్నైలోని ఐసీఎఫ్‌లో ఇప్పటివరకూ 70వేల బోగీలు తయారయ్యాయని, ఫీడ్ బ్యార్ ఆధారంగా తాము చాలా మార్పులు చేస్తున్నామని, భద్రతా ఫీచర్ యాంటీ-క్లైంబర్స్‌పై కూడా పని చేస్తున్నామని తెలిపారు.
2023-24లో ఈ కార్మాగారంలో 736 వందే భారత్ రైలు బోగీలను తయారు చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు .