LOADING...
Vande Mataram: దేశశక్తిని మేల్కొలిపిన గేయం 'వందేమాతరం' : ప్రధాని మోదీ
దేశశక్తిని మేల్కొలిపిన గేయం 'వందేమాతరం' : ప్రధాని మోదీ

Vande Mataram: దేశశక్తిని మేల్కొలిపిన గేయం 'వందేమాతరం' : ప్రధాని మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2025
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

'వందేమాతరం' 150 ఏళ్ల వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆ గేయంపై ప్రత్యేక చర్చకు పార్లమెంట్‌ వేదికైంది. ఈ చారిత్రక సందర్భంలో లోక్‌సభలో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చను ప్రారంభించారు. ఈ చర్చ కోసం మొత్తం 10 గంటల సమయాన్ని దిగువ సభ కేటాయించింది. విపక్షం తరఫున కాంగ్రెస్‌ పార్టీ ఉప నేత గౌరవ్‌ గొగోయ్‌, ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు 'వందేమాతరం'పై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నారు. చర్చను ప్రారంభిస్తూ ప్రధాని మోదీ మాట్లాడారు. 'వందేమాతరం 150వ చారిత్రక ఘట్టానికి మనం సాక్షులమవడం గర్వకారణం. ఈ చర్చ సభ నిబద్ధతను తెలియజేయడమే కాకుండా, భావితరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Details

చర్చలో అధికార-విపక్షాలంటూ భేదాలు లేవు

దేశం ప్రస్తుతం సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌, బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భాన్ని ప్రస్తావించారు. వందేమాతరం రచించినప్పుడు భారత్‌ బానిసత్వంలో ఉంది. ఆ గేయం 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశ రాజ్యాంగ గొంతు నొక్కేశారు. స్వాతంత్య్ర సమరాన్ని ప్రేరేపించిన వందేమాతరం, 1947లో స్వేచ్ఛా వాయువులు అందించిన గానం అయ్యింది. ఈ చర్చలో అధికార-విపక్షాలంటూ భేదాలు లేవు అని పేర్కొన్నారు. బంకించంద్ర ఛటర్జీ తొలిసారిగా 1875లో వందేమాతరం రచించిన విషయాన్ని, అనంతరం తన ప్రసిద్ధ నవల 'ఆనంద్‌మఠ్‌'లో దానికి స్థానం కల్పించిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు.

Details

భారతీయులు ఈ భూమిని తల్లిగా భావిస్తారు

'వందేమాతరం రాజకీయ స్వేచ్ఛ మంత్రం మాత్రమే కాదు. వేదకాలం నుంచి భారతీయులు ఈ భూమిని తమ తల్లిగా భావిస్తున్నారనే భావనను ప్రతిబింబిస్తుందని మోదీ అన్నారు. బ్రిటిష్‌ పాలన భారతీయుల్లో ఆత్మన్యూనతను నింపిన సమయంలో బంకించంద్ర ఛటర్జీ, భారతీయుల శక్తి-సంస్కృతి-ఆత్మవిశ్వాసాలను మేల్కొలిపేలా ఈ గేయాన్ని రచించారు. పరాయి పాలనలో ఉన్న ప్రజలు తమ పోరాటం కేవలం భూమి, అధికారం కోసం కాకుండా, బానిసత్వ సంకెళ్లను తెంచి తమ సంస్కృతిని పునరుజ్జీవింపజేసేందుకు సాగిందన్న సందేశాన్ని ఇది ఇస్తుందని మోదీ స్పష్టంచేశారు.

Advertisement