తదుపరి వార్తా కథనం

Vasireddy Padma: వైసీపీకి మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 07, 2024
12:50 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన పదవికి ఏరాజీనామా చేశారు.
ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం వై.ఎస్.జగన్ కు అందజేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ కోసం పని చేయాలని భావిస్తున్నట్టు ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పని చేయడానికి సిద్దంగా ఉన్నట్టుగా ఆ లేఖలో స్పష్టం చేశారు.
వాసిరెడ్డి పద్మ 2019, ఆగస్టు 8న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు.
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాసిరెడ్డి, ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా పని చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వాసిరెడ్డి పద్మ రాజీనామా
Vasireddy Padma resigns from the position of Women's Chairperson of Andhra Pradesh.
— Yeswanth(యశ్వంత్) (@yeswanth86) March 7, 2024
Is Padma eyeing a #YSRCP ticket? pic.twitter.com/aP08UEIdy4