Page Loader
Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంతక్రియలు పూర్తి
ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంతక్రియలు పూర్తి

Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంతక్రియలు పూర్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2024
06:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రజల సందర్శన కోసం టాటా పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఎన్‌సీపీఏ గ్రౌండ్‌కు తరలించారు. ఆపై గురువారం సాయంత్రం వర్లీ వరకు సాగిన అంతిమయాత్రలో భారీగా ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. వర్లీ శ్మశానవాటికలో రతన్‌ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు, మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పార్సీ మతాన్ని అనుసరించినప్పటికీ, రతన్‌ టాటా అంత్యక్రియలు ఎలక్ట్రిక్ విధానంలో పూర్తయ్యాయి.

వివరాలు 

భిన్న సంప్రదాయం

హిందూ, ముస్లింల మాదిరిగా కాకుండా పార్సీల అంత్యక్రియలు ప్రత్యేకంగా ఉంటాయి. మానవ శరీరాన్ని ప్రకృతికి తిరిగి ఇవ్వాలనే భావనతో వారు సంప్రదాయాన్ని పాటిస్తారు. దహనం లేదా ఖననం వల్ల ప్రకృతి వనరులైన గాలి, నీరు, అగ్ని కలుషితం అవుతాయని జొరాస్ట్రియన్‌లు నమ్ముతారు. అందుకే, ప్రత్యేకమైన పద్ధతిలోనే వారు అంత్యక్రియలు నిర్వహిస్తారు.

వివరాలు 

సంప్రదాయ ప్రక్రియ

అంత్యక్రియలకు ముందు పార్సీలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత పార్థివదేహాన్ని 'టవర్ ఆఫ్ సైలెన్స్' లేదా 'దఖ్మా'కు తీసుకువెళ్తారు. ఈ ప్రదేశంలో రాబందులు శరీరాన్ని తినేందుకు వీలుగా పార్థివదేహాన్ని ఉంచుతారు. ఈ సంప్రదాయాన్ని 'దోఖ్‌మెనాశీని' అంటారు. శరీరం ప్రకృతికి చెందిందనే భావనతో, దాన్ని ప్రకృతిలో విలీనం చేయాలన్నది వారి ఆశయం. రాబందులు లేకపోవడమూ.. కానీ, ఆధునిక కాలంలో పర్యావరణ మార్పులు, రాబందుల లేమీ వంటి సమస్యల వల్ల దఖ్మా పద్ధతిలో అంత్యక్రియలు కష్టంగా మారాయి. దీనితో, విద్యుత్ లేదా సోలార్ విధానంలో దహనవాటికల్లోనే పార్సీలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇది ప్రకృతిని కలుషితం చేయకుండా జొరాస్ట్రియన్‌ సంప్రదాయాలకు అనుగుణంగా కొనసాగుతుందన్న విశ్వాసం.