LOADING...
Radhakrishnan: వికసిత భారత్@2047లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్  
వికసిత భారత్@2047లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఉపరాష్ట్రపతి

Radhakrishnan: వికసిత భారత్@2047లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్  

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 26, 2026
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత గణతంత్రం 77వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి శాశ్వతమైన విలువల పునాదులపై నిర్మితమైన మన బలమైన గణతంత్రాన్ని గర్వంగా జరుపుకునే విశేష సందర్భమిదని ఆయన పేర్కొన్నారు. జనవరి 26వ తేదీ రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టికి నివాళిగా మాత్రమే కాకుండా, రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య ఆదర్శాలను కాపాడే బాధ్యత పౌరులందరిపై ఉందని గుర్తుచేసే పవిత్ర దినమని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలపర్చడంలో ప్రతి పౌరుడి విధులు, కర్తవ్యాలు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

'వికసిత భారత్@2047'

వివిధ రంగాల్లో భారత్ సాధిస్తున్న విశేష పురోగతి మన వ్యవస్థల దృఢత్వానికి, ప్రజల అంకితభావానికి నిదర్శనమని ఉపరాష్ట్రపతి కొనియాడారు. 'వికసిత భారత్@2047' లక్ష్యంతో ముందుకు సాగుతున్న దేశ ప్రయాణంలో ప్రతి భారతీయుడు భాగస్వామిగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా ఐక్యతను మరింత బలోపేతం చేయాలని, సమ్మిళిత భావనను ప్రోత్సహించాలని, అలాగే మన ప్రియమైన గణతంత్ర భారతదేశం అభివృద్ధి, సంక్షేమం కోసం అచంచల నిబద్ధతతో పనిచేయడానికి ప్రతి ఒక్కరికి ప్రేరణనివ్వాలని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆకాంక్షించారు.

Advertisement