
Nishikant Dubey: మోదీ ఉన్నందువల్లే విజయం సాధ్యమైంది : బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ (BJP)కు సంప్రదాయేతర ఓటర్ల మద్దతు రావడంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చరిష్మాకు కీలక పాత్ర ఉందని ఎంపీ నిశికాంత్ దూబే స్పష్టం చేశారు. ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మా నాయకుడిగా లేకపోయి ఉంటే, ఈసారి బీజేపీ 150 సీట్లకు మించకుండా ఉండిపోయేది. ఆయన నాయకత్వం వల్లే పేదలలో విశ్వాసం పెరిగింది. మోదీ వల్లే అనేకమంది సంప్రదాయేతర ఓటర్లు కూడా మాకు మద్దతు ఇచ్చారు. ఆయనే మా పార్టీ బలహీనతను బలంగా మార్చారు.
Details
మోదీకి బీజేపీ అవసరం ఉంది
మేము అందరికీ నచ్చాలన్న నిబంధన లేదు, ఇది వాస్తవం. కానీ మోదీ భాజపాకు అవసరం అనేది నేను కార్యకర్తగా నమ్ముతున్న విషయమని దూబే స్పష్టంగా చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మోదీ అవసరం ఉందని ఆయన అన్నారు. 'అయన ఆరోగ్యం అనుమతించేవరకు ఆయనే మాకు నాయకుడు కావాలి. ఆయన చరిష్మా సంప్రదాయేతర ఓటర్లను ఆకర్షించింది. మోదీ లేకుంటే వారు ఎప్పుడూ భాజపాకు ఓటు వేయే వారు కాదేమోనని అన్నారు.
Details
మోదీకి అలాంటి నిబంధనలు అవసరం లేవు
ఈ సందర్భంలో RSS చీఫ్ మోహన్ భాగవత్ చేసిన 75 ఏళ్ల వయస్సు తరువాత పదవీవిరమణ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. దూబే అందుకు భిన్నంగా స్పందించారు. 'మోదీకి అలాంటి నిబంధనలు అవసరం లేవు. ఆయన తర్వాతే పార్టీ ముఖచిత్రం దేశవ్యాప్తంగా పూర్తిగా మారిపోయింది. మూడు వరుస లోక్‌సభ ఎన్నికల్లో, అనేక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించగలిగాం. బీజేపీ ఉనికిలేని రాష్ట్రాల్లో కూడా ఆయన వలన పార్టీ తనదైన ముద్ర వేసిందని ఆయన అన్నారు.