
వీడియో: లేజర్ లైట్ల వెలుతురులో ధగధగ మెరిసిపోతున్న కొత్త పార్లమెంట్ బిల్డింగ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత పార్లమెంట్ కొత్త భవనాన్ని ఆదివారం రోజున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తమిళనాడు నుండి వచ్చిన మఠాధిపతుల సమక్షంలో ప్రతిష్టాత్మక సెంగోల్ (రాజదండం) ను పార్లమెంట్ భవనంలో ఉంచారు.
ఈ కార్యక్రమంలో భారత పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. 140కోట్ల భారతీయుల ఆశలను కొత్త పార్లమెంట్ ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేసారు.
అయితే ప్రారంభోత్సవం అనంతరం సాయంత్రం పూట లేజర్ లైట్ల వెలుగులో కొత్త పార్లమెంట్ భవనం దేదీప్యమానంగా మెరిసిపోయింది.
ఈ మేరకు లేజర్ లైట్ల వెలుగులో కాంతులీనుతున్న పార్లమెంట్ భవన వీడియోను న్యూస్ ఏజెన్సీ(ANI) సోషల్ మీడియాలో పంచుకుంది.
విద్యుత్ వెలుగు జిలుగుల్లో పార్లమెంట్ భవనానికి సరికొత్త హంగులు వస్తున్నాయి. ఈ వీడియోను ఇప్పుడే చూసేయండి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లేజర్ లైట్ల వెలుతురులో కొత్త పార్లమెంట్
#WATCH | Light and laser show at the new Parliament building in Delhi
— ANI (@ANI) May 28, 2023
PM Narendra Modi inaugurated the #NewParliamentBuilding today. pic.twitter.com/MNq7R9a7ql