Video: Plane gets stuck under bridge: బీహార్‌లో వంతెన కింద ఇరుక్కుపోయిన విమానం
బిహార్‌లోని మోతిహారిలో ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తున్న విమానం భాగం వంతెన కింద ఇరుక్కుపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్రక్కు డ్రైవర్లు, స్థానికుల సహాయంతో విమానంను బయటకు తీశారు. విమానం ముంబై నుంచి అస్సాంకు తీసుకెళ్తుండగా మోతీహారీకి చెందిన పిప్రకోఠి వంతెన కింద ఇరుక్కుపోయింది. కాగా, గతంలో కూడా పలు చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌బాపట్ల జిల్లాలో గతేడాది నవంబర్‌లో రోడ్డు అండర్‌పాస్‌పై విమానం ఇరుక్కుపోయింది. కొచ్చి నుంచి హైదరాబాద్‌కు విమానాన్ని ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.