CM Vijay: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం.. వేడుకలో కనిపించని కొడుకు, కూతురు!
ఈ వార్తాకథనం ఏంటి
దళపతి విజయ్ తన సుదీర్ఘ సినీ ప్రయాణానికి ముగింపు పలికి రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి, నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన టీవీకే నేతలు విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ చారిత్రాత్మక వేడుకలో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ జాసన్ సంజయ్ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలియజేస్తారని అందరూ భావించారు. స్టేడియంలో గానీ, ప్రమాణ స్వీకార వేదికపై గానీ ఆయన కనిపించలేదు.
వివరాలు
సోషల్ మీడియా ద్వారా అభినందనలు కూడా చెప్పలేదు
గత కొంతకాలంగా విజయ్, ఆయన భార్య సంగీత స్వర్ణలింగం మధ్య మనస్పర్థలు ఉన్నాయని, ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కుటుంబ వివాదంలో జాసన్ సంజయ్ తన తల్లి సంగీతకు మద్దతుగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సంగీత లండన్‌లో నివసిస్తుండగా, జాసన్ కూడా ఆమెతోనే ఉంటున్నట్లు సమాచారం. కేవలం ప్రమాణ స్వీకార కార్యక్రమానికే కాకుండా, ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధించిన సమయంలో కూడా జాసన్ సంజయ్ సోషల్ మీడియా ద్వారా కనీసం అభినందనలు తెలియజేయకపోవడం మరింత చర్చకు దారితీసింది.
వివరాలు
కుటుంబ విభేదాలే కారణం
కుటుంబ విభేదాల కారణంగానే ఆయన తండ్రికి దూరంగా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా విజయ్ కుమార్తె దివ్య సాషా కూడా కొంతకాలంగా తల్లి సంగీతతోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రిగా విజయ్ కొత్త బాధ్యతలు స్వీకరిస్తుండగా, మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ పరిణామాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి