Vijayawada: విజయవాడలో కలకలం.. లగేజ్ బ్యాగ్‌లో 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో పేలుడు పదార్థాలు బయటపడటం కలకలం రేపింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ పోలీస్ ఔట్ పోస్టు వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్ అలీ అనే ప్రయాణికుడు పోలీస్ ఔట్ పోస్టు వద్దకు వచ్చాడు. తాను నరసరావుపేట నుంచి బస్సులో విజయవాడకు వస్తుండగా..తన లగేజ్ బ్యాగ్‌కు బదులుగా మరో ప్రయాణికుడి బ్యాగ్ వచ్చిందని పోలీసులకు వివరించాడు. ఆ బ్యాగ్‌ను పరిశీలించిన పోలీసులకు అందులో అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. దీంతో తనిఖీలు చేపట్టగా 46జిలెటిన్ స్టిక్స్,50ఎలక్ట్రిక్ డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్ అసలు ఎవరిది?పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విజయవాడ కృష్ణలంక పరిధిలో పేలుడు పదార్థాలు కలకలం
విజయవాడ కృష్ణలంక పరిధిలో పేలుడు పదార్థాలు కలకలం
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2026
ఓ బ్యాగ్‌లో 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను గుర్తింపు
నరసరావుపేట నుంచి విజయవాడకు బస్సులో వెళ్తూ.. అక్కడ తన బ్యాగ్ బదులు మరొకరి బ్యాగ్ ఉండటం గుర్తించి దాన్ని తెరిచి చూడగా, అందులో బాంబులు ఉండటం గమనించి పోలీసులకు…