Page Loader
Haryana: హర్యానాలో రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ వెనుకంజ‌..లీడింగ్‌లో బీజేపీ అభ్య‌ర్థి
హర్యానాలో రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ వెనుకంజ‌

Haryana: హర్యానాలో రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ వెనుకంజ‌..లీడింగ్‌లో బీజేపీ అభ్య‌ర్థి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2024
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ సర్వత్రా ఆసక్తికరంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. జులానా నియోజకవర్గంలో రెజ్లర్ వినేశ్ పోగట్ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఆ ప్రాంతంలో పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, నాలుగు రౌండ్లు ముగిసే వరకు యోగేశ్ మూడు వేల ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి బీజేపీ ప్రస్తుతం 47 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోతున్నకాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్