
Manipur violence: మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. 17 మందికి తీవ్ర గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. తాజాగా బిష్ణుపూర్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
కంగ్వాయి, ఫౌగాచావో ప్రాంతాల్లో కొంతమంది ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.
హింసాత్మక ఘటనలకు అణిచివేయడానికి ఆర్మీ, ఆర్ఏఎఫ్ సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించినట్లు అధికారులు ధ్రువీకరించారు.
ఈ హింసలో 17 మంది ఆందోళనకారులకు తీవ్ర గాయలైనట్లు స్థానిక పోలీసులు స్పష్టం చేశారు.
మరోవైపు మణిపూర్ ఘటనపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. గురువారం విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పార్లమెంట్ కార్యకలాపాలను వాయిదా వేశారు.
Details
ఇంఫాల్ లోయ అంతటా రాత్రిపూట కర్ఫ్యూ
ప్రభుత్వ యంత్రాంగం ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ సహా భిషంపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపును ఉపసంహరించుకుంది.
అయితే ఇంఫాల్ లోయ అంతటా రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పగటిపూట ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు మణిపూర్ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మణిపూర్ చెలరేగిన హింస కారణంగా మృతి చెందిన కుకీ వర్గానికి చెందిన వారి మృతదేహాలను ఈ భూమిలో ఖననం చేయాలన్నారు.
అలా చేయడంతో ఇప్పటికే అస్థిరమైన శాంతిభద్రత పరిస్థితి మరింత దిగజారుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.