LOADING...
Viral video: డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమార్తె
డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమార్తె

Viral video: డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమార్తె

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2025
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తెకు సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె ఓ వ్యక్తిని చెప్పుతో కొడుతూ, అతడిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సంఘటన డిస్పూర్‌లోని అత్యంత భద్రత కలిగిన ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్‌లో జరిగింది. అసలు విషయం ఏమిటంటే? సదరు వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మహంత వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని ఆయన కుమార్తె వెల్లడించారు. అయితే, అతను నిత్యం మద్యం తాగి వచ్చి తనతో దురుసుగా ప్రవర్తించేవాడని ఆరోపించారు. ఈ వ్యవహారంపై గతంలో అనేకసార్లు అతడిని హెచ్చరించినప్పటికీ మార్పు రాలేదని చెప్పారు.

వివరాలు 

పోలీసులకు ఫిర్యాదు ప్రశ్నపై స్పష్టమైన సమాధానం లేదు 

అయితే, సోమవారం అతడు మద్యం మత్తులో వచ్చి తన గదిపై తలుపు కొట్టాడని, అందుకే అతడికి ఈ విధంగా బుద్ధి చెప్పాల్సి వచ్చిందని మహంత కుమార్తె వివరించారు. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్నకు ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ప్రఫుల్ల కుమార్ మహంత అస్సాం రాష్ట్ర ప్రధాన రాజకీయ పార్టీ అయిన అసోం గణ పరిషత్ (AGP) సహ వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు. ఆయన 1985 నుంచి 1990 వరకు, 1996 నుంచి 2001 వరకు రెండుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2021లో తన పార్టీతో విభేదాల కారణంగా అస్సాం శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సోషల్ మీడియాలో వైరల్ వీడియో ఇదే..