Page Loader
Gurugram:పెంపుడు కుక్కను దారుణంగా కొట్టాడు.. వీడియో వైరల్ కావడంతో కేర్‌టేకర్‌ని తొలగించిన యజమాని 
Gurugram:పెంపుడు కుక్కను దారుణంగా కొట్టాడు

Gurugram:పెంపుడు కుక్కను దారుణంగా కొట్టాడు.. వీడియో వైరల్ కావడంతో కేర్‌టేకర్‌ని తొలగించిన యజమాని 

వ్రాసిన వారు Stalin
May 14, 2024
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ కేర్‌టేకర్‌ పెంపుడు కుక్క పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు. దానిని లిఫ్ట్‌లో కనికరం లేకుండా కొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్కను కొట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని పోలీసులను నెటిజన్లు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే కేర్‌టేకర్‌ ని ఉద్యోగం నుంచి తొలగించారు. కేర్‌టేకర్ కుక్కను ఎందుకు కొట్టాడో ఇంకా స్పష్టంగా తెలియలేదు. శునక ప్రేమికుడు విదిత్ శర్మ ఈ వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లిఫ్ట్ లో కుక్కను కొడుతున్న దృశాలు..