
Vishakapatnam: విశాఖ నుంచి పోర్ట్‌బ్లెయిర్, ముంబయిలకు విమాన సర్వీసులు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోర్ట్‌బ్లెయిర్, ముంబయి నగరాలకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రకటించాయి. ఈ సర్వీసులు ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. సోమ, శుక్ర, శనివారాల్లో నడుస్తుంది.విశాఖపట్నం నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్లే విమానం ప్రతి ఉదయం 8 గంటలకు బయలుదేరి, ఉదయం 10 గంటలకు అక్కడకు చేరుకుంటుంది. పోర్ట్‌బ్లెయిర్ నుంచి మళ్లీ విమానం ఉదయం 10.30 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖకు చేరుకుంటుందని వివరించారు.
వివరాలు
విశాఖపట్నం-ముంబయి మధ్య మరో కొత్త విమాన సర్వీసు
అలాగే విశాఖపట్నం-ముంబయి మధ్య మరో కొత్త విమాన సర్వీసు కూడా ఆగస్టు 1వ తేదీ ఉదయం నుంచి ప్రారంభం కానుంది. ఈ విమానం ముంబయి నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరి, ఉదయం 9.05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అనంతరం విశాఖ నుంచి మళ్లీ అదే విమానం ఉదయం 9.40 గంటలకు బయలుదేరుతుందని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సర్వీసులకు సంబంధించి టికెట్ల విక్రయాలు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. కాగా విశాఖ-ముంబయి మధ్య ఇప్పటికే సాయంత్రం సమయంలో మరో విమాన సర్వీసు నడుస్తుండగా, ఈ కొత్త ఉదయం సర్వీసు మరింత సౌకర్యాన్ని అందించనుంది.