Page Loader
Delhi Airport: దిల్లీలో దట్టమైన పొగమంచు.. విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం
Delhi Airport: దిల్లీలో దట్టమైన పొగమంచు.. విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం

Delhi Airport: దిల్లీలో దట్టమైన పొగమంచు.. విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 25, 2023
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీని దట్టమైన పొగమంచు ఆవరించింది. దింతో ఢిల్లీ వ్యాప్తంగా పలు చోట్ల విజిబిలిటీ మందగించింది. పొగమంచుతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. 125 నుండి 175 మీటర్ల మధ్య ఉన్న అన్ని రన్‌వేలలో రన్‌వే విజువల్ రేంజ్ (RVR)తో తెల్లవారుజాము నుండి చాలా దట్టమైన పొగమంచు విమానాశ్రయాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో టేకాఫ్‌,ల్యాండింగ్‌ల కోసం CAT IIIB కార్యకలాపాలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నివేదించింది.

Details 

395 వద్ద AQI

సోమవారం ఉదయం 9.45 గంటల వరకు రన్ వే విజిబిటిలీ 500 మీటర్ల కంటే ఎక్కువగా ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తెల్లవారుజాము నుండి విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో పాటు పలు విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. ఐఎండీ నివేదిక ప్రకారం..దిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. సఫర్ యాప్ అందించిన రియల్ టైమ్ డేటా ప్రకారం, సోమవారం ఢిల్లీలోని గాలి నాణ్యత 'చాలా పేలవమైన' కేటగిరీలో ఉంది, AQI 395 వద్ద ఉంది. ఉదయం పూట దట్టమైన పొగమంచు వల్ల కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌ గా ఉంది.