
నవీన్ పట్నాయక్ సహాయకుడు వీకే పాండియన్ కి ఒడిశా కేబినెట్ మంత్రి హోదా
ఈ వార్తాకథనం ఏంటి
స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఒక రోజు తర్వాత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన VK పాండియన్ - ఒడిశా ప్రభుత్వంలో 5T (ట్రాన్స్‌ఫార్మేషనల్ ఇనిషియేటివ్స్) 'నబిన్ ఒడిశా' ఛైర్మన్‌గా నియమించారు.
అడిషనల్ చీఫ్ సెక్రటరీ సురేంద్ర కుమార్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, పాండియన్‌ను క్యాబినెట్ మంత్రి హోదాలో నియమించారు,అయన నేరుగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు నివేదించనున్నారు.
2000 బ్యాచ్‌కు చెందిన ఒడిశా కేడర్ IAS అధికారి, పాండియన్ సర్వీస్ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు.
కేంద్ర ప్రభుత్వం పాండియన్ కి సోమవారం ఆమోదం తెలిపింది. ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వీకే పాండియన్‌కు కేబినెట్ మంత్రి హోదా
#BREAKING_NEWS
— OTV (@otvnews) October 24, 2023
VK Pandian gets Cabinet Minister rank a day after his voluntary retirement from service, appointed #Odisha 5T chairman
Stay tuned for further details on this breaking news, click here: https://t.co/sJ6e124C9W pic.twitter.com/4PcTOe4PPq