Page Loader
VLO: భూ పరిపానలలో సంస్కరణలకు సంబంధించి.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం
VLO: భూ పరిపానలలో సంస్కరణలకు సంబంధించి.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

VLO: భూ పరిపానలలో సంస్కరణలకు సంబంధించి.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2024
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలనలో సంస్కరణలను అమలు చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకుంది. రెవెన్యూ వ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ చర్యలో భాగంగా, గ్రామ స్థాయి అధికారులను (వీఎల్‌వో) నియమించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఎల్‌వోను నియమించనున్నారు. ఈ నేపథ్యంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ సోమవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లకు అధికారిక ఉత్తర్వులు పంపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీఆర్‌వో, వీఆర్‌ఏలను వివిధ శాఖల్లోకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ వీఆర్‌వో, వీఆర్‌ఏలను వీఎల్‌వోలుగా నియమించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది.

వివరాలు 

 ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు

ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి, అర్హులను గుర్తిస్తారు. అనంతరం వారిని రెవెన్యూ శాఖలోకి తీసుకుంటారు. వీరి గురించి సమాచారం సేకరించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఈ ప్రక్రియను మరో నాలుగు రోజుల్లో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించనుంది. రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 7,039 వీఆర్‌వో పోస్టులకు 5,195 మంది, 25,750 వీఆర్‌ఏ పోస్టులకు 20,255 మంది పనిచేసేవారు. వీరిలో టెన్త్, ఇంటర్, డిగ్రీ లేదా ఆపై చదువుకున్న వారు ఉన్నారు. గత ప్రభుత్వం 2022లో వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసిన సంగతి తెలిసిందే.