
Amit Shah: పోటా అంటే ఏమిటి? ఆ చట్టం ఎత్తివేతపై అమిత్ షా ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి యుపీఏ ప్రభుత్వం తీవ్రవాద నిరోధక చట్టమైన పోటా (ప్రివెన్షన్ ఆఫ్ టెరరిజం యాక్ట్)ను రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. 2002లో వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పోటా చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పట్లో దానికి ఎదురుగా నిలిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియాగాంధీ-మన్‌మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపీఏ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసింది. ఆ చట్టాన్ని ఎవరిని కాపాడేందుకు రద్దు చేశారు? ఈ దేశ ప్రజల భద్రత కన్నా ఓటు బ్యాంకు ముఖ్యమా?" అంటూ అమిత్‌షా ప్రశ్నించారు.
Details
కాంగ్రెస్ పాలనలో 1000 మంది మృతి
అదేవిధంగా కాంగ్రెస్ పాలనలో ఉగ్రవాద దాడుల్లో సుమారు 1000 మంది ప్రాణాలు కోల్పోయారని హోంమంత్రి ఆరోపించారు. బటలా హౌస్ ఎన్‌కౌంటర్‌లో పోలీసులు మరణించినప్పటికీ కాంగ్రెస్ నేతలు కన్నీళ్లు కార్చింది మాత్రం ఉగ్రవాదుల కోసం. అంతే కాదు... ఉగ్రవాదుల ఫోటోలను పాకిస్తాన్‌కు పంపిన ఘాతుకం కూడా కాంగ్రెస్ చేసిందని అమిత్ షా విమర్శలు గుప్పించారు. హోంమంత్రి వ్యాఖ్యలతో లోక్‌సభలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ భద్రతపై జరుగుతున్న చర్చలో రాజకీయ ఆరోపణలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.