Page Loader
Vote from Home: 'ఓటు ఫ్రమ్ హోమ్' అంటే ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 
'ఓటు ఫ్రమ్ హోమ్' అంటే ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Vote from Home: 'ఓటు ఫ్రమ్ హోమ్' అంటే ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 

వ్రాసిన వారు Stalin
Oct 21, 2023
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అన్ని వర్గాల ఓటర్లను వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఈసారి తొలిసారిగా తెలంగాణలో 'ఓటు ఫ్రమ్ హోమ్' సౌకర్యాన్ని ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. అసలు 'ఓటు ఫ్రమ్ హోమ్' అంటే ఏమిటి? ఇది ఎవరి కోసం? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 'ఓటు ఫ్రమ్ హోమ్' అనే సదుపాయాన్ని దేశంలో తొలిసారిగా కర్ణాటక ఎన్నికల సమయంలో ఈసీ విజయవంతంగా ప్రవేశపెట్టింది.

ఓటు

'ఓటు ఫ్రమ్ హోమ్' వేయడానికి ఎవరు అర్హులు? 

ఎన్నికల ప్రవర్తన నియమావళి 1961లోని రూల్- 27A (aa) ప్రకారం ఇంటి నుంచి ఓటు వేయవచ్చు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేయడానికి అర్హులు. ఉద్యోగం చేసేవారు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వ్యక్తులు దీనికి అర్హులు. కరోనా బాధితులు కూడా దినికి అర్హులు. తెలంగాణలో 5.06 లక్షల మంది వికలాంగుల ఓటర్లు ఉన్నారు. 4.4 లక్షల మంది 80 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉన్నారు. వందేళ్లుపై బడిన వారు 7,000 మంది ఓటర్లు ఉన్నారు

ఓటు

'ఓటు ఫ్రమ్ హోమ్' ఎలా దరఖాస్తు చేయాలి? 

ఇంటి వద్దే ఓటు వేయాలని కోరుకునే ఓటర్లు ఫారం 12-డీని నింపి.. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన 5రోజుల్లోగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. బూత్ లెవల్ అధికారులు దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్లకు వెళ్లి ఫారం 12డీ డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఓటు ఎలా వేస్తారు? ఇంటి ఓటింగ్ కోసం ఓటరు దరఖాస్తును ఆమోదించిన తర్వాత, ఇద్దరు ఎన్నికల సంఘం అధికారులతో కూడిన పోలింగ్ బృందం ఓటర్ల ఇంటికి వెళుతుంది. 'ఓటు ఫ్రమ్ హోమ్' ద్వారా ఓటు వేసే వారు పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేస్తారు. ఓటు వేసిన తర్వాత, బ్యాలెట్లు ఆర్ఓ వద్ద నిల్వ చేస్తారు. ఈ ఓట్ల లెక్కింపు ఇతర ఓట్లతోనే జరుగుతుంది.