LOADING...
Te-poll: ఓటర్‌ స్లిప్‌ డౌన్‌లోడ్‌ ఇక సులభం.. టీ-పోల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా సేవలు
ఓటర్‌ స్లిప్‌ డౌన్‌లోడ్‌ ఇక సులభం.. టీ-పోల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా సేవలు

Te-poll: ఓటర్‌ స్లిప్‌ డౌన్‌లోడ్‌ ఇక సులభం.. టీ-పోల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా సేవలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2025
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

పౌరులకు ఎన్నికల సేవలను మరింత సులభతరం చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం (టీజీ ఎస్‌ఈసీ) కొత్తగా అభివృద్ధి చేసిన 'టీ-పోల్'(Te-poll)మొబైల్ అప్లికేషన్‌ను గురువారం విడుదల చేసింది. ఈ అప్లికేషన్ ప్రస్తుతం ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంది. యాప్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల సేవలకు సంబంధించి పౌరులకు వేగవంతమైన, సులభమైన డిజిటల్ సౌకర్యాలు కల్పించేందుకు రూపొందించిన 'టీ-పోల్' యాప్‌ను టీజీ ఎస్‌ఈసీ అధికారికంగా లాంచ్ చేసింది. ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ కావడం, పోలింగ్ స్టేషన్ వివరాలను తెలుసుకోవడం, ఫిర్యాదులు నమోదు చేయడం, నమోదు చేసిన ఫిర్యాదుల పరిష్కార ప్రగతిని ట్రాక్ చేయడం వంటి సేవలకు ఈయాప్‌ మరింత సౌలభ్యం కల్పించనున్నట్లు ఎస్‌ఈసీ కార్యదర్శి మందా మకరంద్ తెలిపారు.

Details

ప్లే స్టోర్ లో అందుబాటులో

ప్లే స్టోర్‌లో యాప్ అందుబాటులో ఉందని, ఈ లింక్‌ ద్వారా [https://play.google.com/store/apps/details?id=com.cgg.gov.in.te_poll_telugu](https://play.google.com/store/apps/details?id=com.cgg.gov.in.te_poll_telugu) టీ-పోల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.

Advertisement