LOADING...
Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. ఎన్డీయే-విపక్ష అభ్యర్థుల మధ్య హైటెన్షన్ పోటీ
ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. ఎన్డీయే-విపక్ష అభ్యర్థుల మధ్య హైటెన్షన్ పోటీ

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. ఎన్డీయే-విపక్ష అభ్యర్థుల మధ్య హైటెన్షన్ పోటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 09, 2025
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా తర్వాత ఖాళీగా ఉన్న ఉప రాష్ట్రపతి పదవిని భర్తీ చేసేందుకు మంగళవారం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ పదవికి ఎన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan), విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి (B. Sudershan Reddy) పోటీలో ఉన్నారు. పార్లమెంటు నూతన భవనంలోని 'ఎఫ్‌-101 వసుధ'లో ఉదయం 10 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి, రాత్రికే ఫలితాలను ప్రకటించనున్నారు.