Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త.. ఆ రూట్లలో వెళ్లేవారికి నాలుగు ప్రత్యేక రైళ్లు
పండుగ సీజన్‌లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఇండియన్ రైల్వే న్యూ టిన్సుకియా-ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు. దసరా పండుగ సీజన్‌లో ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి విజయవాడ-శ్రీకాకుళం రోడ్ - విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతారని తెలిపారు.
మొత్తం ఎనిమిది ట్రిప్పులు
న్యూ టిన్సుకియా- ఎస్ఎంవీటీ బెంగళూరు ప్రత్యేక రైలు (05952)ను నవంబర్ 7 నుంచి డిసెంబర్ 26 వరకు నడిపించనున్నారు. ఈ రైలు ప్రతి గురువారం సాయంత్రం 6:45 గంటలకు న్యూ టిన్సుకియా నుండి బయలుదేరుతుంది. ఇది మూడో రోజైన శనివారం మధ్యాహ్నం 12:12 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది. అనంతరం విజయనగరం మధ్యాహ్నం 1:30 గంటలకు, కొత్తవలస 2:05 గంటలకు, పెందుర్తి 2:15 గంటలకు, దువ్వాడ 3:20 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి మధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 9:00 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరుకు చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం ఎనిమిది ట్రిప్పులు తిరుగుతుంది.
నవంబర్ 11 నుంచి డిసెంబర్ 30 వరకు ప్రత్యేక రైలు
ఎస్ఎంవీటీ బెంగళూరు - న్యూ టిన్సుకియా ప్రత్యేక రైలు (05951)ను నవంబర్ 11 నుంచి డిసెంబర్ 30 వరకు నడిపించనున్నారు. ఎస్ఎంవీటీ బెంగళూరు నుండి ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటలకు బయలుదేరి సోమవారం రాత్రి 9:15 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. పెందుర్తి రాత్రి 10:08 గంటలకు, కొత్తవలస రాత్రి 10:20 గంటలకు, విజయనగరం రాత్రి 10:50 గంటలకు, శ్రీకాకుళం రోడ్డు రాత్రి 11:50 గంటలకు చేరుకుని, అక్కడి నుంచి రాత్రి 11:52 గంటలకు బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 1:15 గంటలకు న్యూ టిన్సుకియా చేరుకుంటుంది. ఈ రైలు కూడా ఎనిమిది ట్రిప్పులు తిరుగుతుంది.
శ్రీకాకుళం రోడ్డు- విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు
ఈ రెండు ప్రత్యేక రైళ్లలో దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, ఈస్ట్ కోస్ట్ రైల్వే మీదుగా కటక్, భద్రక్ లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 1 సెకెండ్ ఏసీ, 5 థర్డ్ ఏసీ, 14 స్లీపర్ క్లాస్, 2 సెకెండ్ క్లాస్ కమ్ లగేజీ కోచ్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కె. సందీప్ కోరారు. దసరా పండుగ సీజన్లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి విజయవాడ-శ్రీకాకుళం రోడ్ - విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. విజయవాడ - శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (07215) రైలు అక్టోబర్ 6 నుంచి 8 వరకు నడిపించనున్నారు.
శ్రీకాకుళం రోడ్డు- విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు
ఈ రైలు విజయవాడ నుండి రాత్రి 8:00 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు తెల్లవారు జామున 1:28 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడ నుంచి ఉదయం 1:30 గంటలకు బయలుదేరుతుంది. పెందుర్తి ఉదయం 2:23 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి తెల్లవారు జామున 2:25 గంటలకు బయలుదేరుతుంది. కొత్తవలసకు తెల్లవారు జామున 2:33 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి తెల్లవారు జామున 2:35 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం తెల్లవారు జామున 3:05 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి తెల్లవారు జామున 3:15 గంటలకు బయలుదేరుతుంది. చీపురుపల్లి తెల్లవారు జామున 3:38 గంటలకు చేరుకుని, తెల్లవారు జామున 3:40 గంటలకు బయలుదేరుతుంది.
శ్రీకాకుళం రోడ్-విజయవాడ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
పొందూరు తెల్లవారు జామున 3:58 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి తెల్లవారు జామున 4:00 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం రోడ్డుకు ఉదయం 5:30 గంటలకు చేరుకుంటుంది. శ్రీకాకుళం రోడ్-విజయవాడ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్(07216)రైలు అక్టోబర్ 7 నుంచి 9 వరకు నడిపించనున్నారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్‌లో ఉదయం 6:30 గంటలకు బయలుదేరుతుంది.ఇది ఉదయం 6:43 గంటలకు పొందూరు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 6:45 గంటలకు బయలుదేరుతుంది. చీపురుపల్లి ఉదయం 7:10 గంటలకు చేరుకుని,అక్కడ నుంచి ఉదయం 7:12 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం ఉదయం 7:50 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి ఉదయం 8:00 గంటలకు బయలుదేరుతుంది. కొత్తవలస ఉదయం 8:30 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి ఉదయం 8:32 గంటలకు బయలుదేరుతుంది.
రైలు సేవలను ప్రజలు వినియోగించుకోవాలి: సందీప్
పెందుర్తి ఉదయం 8:40 గంటలకు చేరుకుని, అక్కడ నుండి ఉదయం 8:42 గంటలకు బయలుదేరుతుంది. దువ్వాడ ఉదయం 9:30 గంటలకు చేరుకుని, అక్కడ నుండి ఉదయం 9:32 గంటలకు బయలుదేరుతుంది. విజయవాడ సాయంత్రం 4:00 గంటలకు చేరుకుంటుంది. ఈ రెండు ప్రత్యేక రైళ్లకు ఏలూరు,తాడేపల్లిగూడెం,నిడదవోలు,రాజమండ్రి,ద్వారపూడి,అనపర్తి, సామర్లకోట,అన్నవరం,తుని,ఎలమంచిలి,అనకాపల్లి,దువ్వాడ,పెందుర్తి,కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం మధ్య స్టాప్‌లు ఉంటాయి. ఈ రైళ్లలో 2 సెకెండ్ ఏసీ కోచ్‌లు, 6 థర్డ్ ఏసీ కోచ్‌లు, 7 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 3 జనరల్ సెకండ్ క్లాస్, 1 సెకెండ్ క్లాస్ కమ్ డియాగన్ కోచ్, 1 మోటార్ కార్ ఉంటాయి. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రజలు వినియోగించుకోవాలని వాల్తేర్ ఎస్‌డీసీఎం కె. సందీప్ కోరారు.